RRR చిత్రం కోసం ఒక భారీ యాక్షన్ సీన్‌ని రాజమౌళి పూర్తి చేసాడు. ఈ ఫైట్ సీన్ కోసం యాభై రోజుల పాటు శ్రమించారు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంత ఖర్చుతో, అంతే సమయంలో ఒక మిడిల్ రేంజ్ సినిమా తీసేసుకోవచ్చట. అంటే సినిమాలో అయిదారు నిమిషాల సన్నివేశం బదులుగా రెండున్నర గంటల సినిమా తీయవచ్చునన్న మాట.దీనిని బట్టి ఈ చిత్రానికి అవుతోన్న ఖర్చెంత, ఒక్కో సీన్‌కీ పడుతోన్న సమయమెంత అనేది అర్థం చేసుకోవచ్చు. మరి అంత ఖర్చు పెట్టి.. కేవలం ఒక్క సీన్ కోసమే యాభై రోజుల సమయం కేటాయించారంటే.. రేపు సినిమా విడుదలయ్యాక థియేటర్స్ లో ఈ యాక్షన్ సీన్ కి గూస్ బంప్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు.