మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకర్నొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు.. మహేష్ నటించిన సైనికుడు సినిమా సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు విడుదలైంది. గుణ శేఖర్ దర్శకత్వంలో సరిగ్గా 14 ఏళ్ల ముందు ఇదే రోజు వచ్చిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కొంతమంది మహేష్ అభిమానులు #14ఇయర్స్ సైనికుడు అంటూ ట్రెండింగ్ షురూ చేశారు.నిజానికి ఇదొక ఫ్లాప్ సినిమా అనే విషయం మహేష్ ఫ్యాన్స్ కి కూడా తెలుసు..అయితే ఇలాంటి సినిమాను ట్రెండ్ చేయొద్దంటూ మరో మహేష్ ఫ్యాన్స్ గ్రూప్ ప్రచారం అందుకుంది. దీంతో మహేష్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు.ఓ వర్గం మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సైనికుడు సినిమాపై ప్రచారం స్టార్ట్ చేస్తే.. మరో వర్గం మహేష్ ఫ్యాన్స్ మాత్రం దాన్ని మరిపించేలా మహేష్ కొత్త ఫొటోలతో ట్రెండింగ్ మొదలుపెట్టింది.