పెళ్లి తర్వాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా రాశి, ప్రస్తుతం సినిమా ఆఫర్లు రావడంతో మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు.  అయితే ఇటీవల రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర గురించి రాశి కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాకు వెల్లడించారు.అనసూయ భరధ్వాజ చేసిన ఈ క్యారెక్టర్ కోసం మొదటగా చిత్రబృందం తననే సంప్రదించారని చెప్పింది. అయితే ఆ పాత్రలో మోకాళ్ల వరకు చీర కట్టుకోవాలనే కారణంతో ఆ క్యారెక్టర్ వదిలిపెట్టాల్సి వచ్చిందన్నారు. సినిమాలో ఆ పాత్ర నచ్చినప్పటికీ మోకాళ్ల వరకు చీర కట్టుకునే పద్దతి నాకు నప్పదని తిరస్కరించానని వెల్లడించింది. అయితే అనసూయ ఈ క్యారెక్టర్లో చాలా బాగా నటించిందని తన అభిప్రాయాన్ని చెప్పింది.