సినిమాలను పక్కన పెట్టి పాలిటిక్స్ పైనే ఫోకస్ పెట్టిన పవన్.. లుక్ విషయంలో కూడా పెద్దగా కేర్ తీసుకున్నట్లు అనిపించలేదు. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడైన తర్వాత 'వకీల్ సాబ్' కోసం లుక్ లో కాస్త వేరియేషన్ చూపించాడు.  ఈ క్రమంలో సన్నగా మారడం కోసం ఇప్పుడు పవన్ కేవలం ద్రవ పదార్ధాలను మాత్రమే తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తున్నాడట.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొనిఈ రీమేక్ కథలో పలు చేంజెస్ చేసారని తెలుస్తోంది.అందులో పవన్ సన్నగా కనిపించాల్సి ఉండగా.. దాని కోసం లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నాడట. పవన్ గతంలో 'జానీ' సినిమా కోసం కష్టపడి సన్నగా మారాడు.  అలానే చాతుర్మాస్య దీక్ష సమయంలో కూడా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యాడు.ఇప్పుడు మాత్రం లిక్విడ్ డైట్ ని పాటిస్తూ సన్నాబడాలని చేస్తున్నాడట.