సుకుమార్ తాజాగా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడట. కొండాపూర్ ప్రాంతంలో అన్ని సౌకర్యాలతోనూ ఎంతో అందంగా సుకుమార్ కొత్త ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఇంటి ఖరీదు రూ. 12 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరో విషయం ఏంటంటే.. సుకుమార్ కొత్త ఇంటి గృహప్రవేశం కార్యక్రమం కూడా ఇటీవలే పూర్తి చేశాడట. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి ఎవరినీ ఆహ్వానించలేదని అంటున్నారు.రంగస్థలం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మన సుకుమార్ కి ఆ సినిమా భారీగానే లాభాలు తెచ్చిపెట్టినట్లుంది.. అందుకేనేమో ఏకంగా 12కోట్లు పెట్టి కొత్త ఇల్లును కొన్నాడు. ఒక ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్ తో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు.