ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, సినిమా టిక్కెట్లను సవరించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అయితే, థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు యాజమాన్యాలకు అడ్డంకిగా మారాయి. ఎందుకంటే కరోనా వ్యాప్తిని అడ్డుకుంటూ 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు తెరవాలి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఏ థియేటర్ తెరుచుకోలేదు.అయితే మొదటగా ఏఎంబీ సినిమాస్ డిసెంబర్ 4న తెరుచుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్ ఒకడుగు ముందుకేసి సినీ ప్రదర్శన మొదలుపెడుతోంది.