సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్' నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను బి.వి.ఎస్. ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులను నిర్మాత ఓ ఓటీటీ సంస్థకు అమ్మేశారు. డిజిటల్, శాటిలైట్ హక్కులను తన దగ్గరే ఉంచుకుని థియేటర్ హక్కులను సదరు ఓటీటీ సంస్థకు అమ్మేసినట్టు తాజా సమాచారం. ఈ సినిమా థియేటర్ హక్కులను యువి సంస్థ రూ.8 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.