ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్లో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ ఉంది. అయితే సహజంగా గెస్ట్ రోల్ చేసినందుకు అసలు రెమ్యునరేషన్ తీసుకోరు.  కానీ ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోన్నందుకు ఏకంగా 22 కోట్లు తీసుకున్నారట..ఇంతకీ ఆ గెస్ట్ రోల్ ని చేస్తున్నది మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. మరి రెమ్యూనరేషన్ కూడా.. ఆయన స్థాయికి తగ్గట్లు ఉండాలి కాబట్టి 22 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా కొన్ని నిముషాల పాత్ర కోసం 22 కోట్లు అంటే.. మాములు విషయం కాదు. ఐతే, ఈ పాత్ర కోసం అమితాబ్ గట్టిగానే డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ కూడా 22 కోట్ల పారితోషికం ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది.