షూటింగ్ లలో ఎంత బిజీగా ఉన్నా వ్యాయామం విషయంలో మాత్రం రష్మిక రాజీ పడదు. ఇంట్లో ఉన్నా, షూటింగ్లకు వెళ్లినా వర్కవుట్లు మాత్రం చేయాల్సిందే. తన వర్కవుట్ వీడియోలను రష్మిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసిన రష్మిక..`వర్కవుట్ చేయడానికి మీకందరికీ ప్రేరణ అవసరమా? నన్ను చూసి నేర్చుకోండి` అంటూ కామెంట్ చేసింది.ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.