RRR సినిమా విడుదల కావడానికి మరికొంత సమయం పడుతుందని వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన షూటింగ్స్‌లో కూడా ప్రధానమైన యాక్షన్ సన్నివేశాలనే తెరకెక్కించారట మన జక్కన్న.ఇంకా రామ్‌చరణ్ ఆలియా లతో, ఎన్టీఆర్ ఒలివియాతో కలిపి చిత్రీకరణ జరపాల్సి ఉందట. అలాగే ఈ చిత్రానికి గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉండడంతో... కరోనా వల్ల గ్రాఫిక్స్ కంపెనీల ఉద్యోగులు కూడా లేకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. ఇటువంటి కారణాల రీత్యా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల ఆలస్యమవుతున్న కొద్దీ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా RRR సినిమా కోసం ఎదురుచూసే ప్రతీ ఒక్కరినీ ఈ వార్త నిరాశ కలిగిస్తోందని చెప్పుకోవచ్చు.