కన్నడ హీరో ధృవ సర్జా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడు. పొగరు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పొటీ పడగా 3 కోట్లకి పైగా ఫ్యాన్సీ రేటుతో వైజాగ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, ప్రోడ్యూసర్ డి.ప్రతాప్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.తెలుగులో ప్రస్తుతం ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక అడుగుపెట్టిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఈ నమ్మకంతోనే ఇప్పుడు పొగరు సినిమాకు కూడా ఇంత రేట్ పెట్టినట్లు తెలుస్తుంది.