తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.