ప్రస్తుతం బోయపాటి చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు ఓకే చేసారు మన బాలయ్య. తాజా సమాచారం ప్రకారం రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య అందులో ఒక సినిమాని కొత్త దర్శకుడు డైరక్ట్ చేయనున్నారు.యువ హీరో నాగ శౌర్య ఆ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే 'బలరామయ్య బరిలో దిగితే..' అనే టైటిల్ తో రూపొందే చిత్రానికి సైతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఈ కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.ఇక బాలయ్య - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ కథని తెరపైకి తీసుకెళ్లేందుకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సన్నాహాలు చేస్తోంది.