.ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న ఈ నాలుగు సినిమాలు బడ్జెట్ మొత్తం కలిపితే దాదాపుగా 1500 కోట్ల వరకు ఉంటుంది. 'రాధే శ్యామ్' చిత్రానికి సుమారు 300 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది.  ఆ తరువాత చేస్తున్న 'ఆదిపురుష్' బడ్జెట్ 500 కోట్ల పైనే అని సమ5. ఇక నాగ్ అశ్విన్ సినిమాకి 450 కోట్లకు పైన బడ్జెట్ అని ఆల్రేడీ ప్రకటించేశారు నిర్మాతలు. ఇప్పుడు 'సలార్' సినిమాకు కూడా ఇంతే రేంజ్ లో బడ్జెట్ ఉండబోతుందని తెలుస్తోంది. అంటే ఈ నాలుగు సినిమాల బిజినెస్ కూడా దాదాపు 2500 కోట్లు పైనే జరగొచ్చు. దీని బట్టి చూస్తే ఇండియాలో ఇంత రేంజ్ లో బిజినెస్ అలానే బడ్జెట్ మార్కెట్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.