ప్రముఖ మాజీ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి భార్య, రచయిత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తరువాత తన పిల్లలు ఆద్య, అకీరాలతో చాలా సంతోషంగా వుంది. తాజాగా ఒక ప్రోగ్రామ్ లో తన పిల్లల గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది.ప్రస్తుతం ఆ సంఘటన పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని బాధకు గురి చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే... రేణు దేశాయ్ తాజాగా సుమ హోస్టింగ్ చేస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొని తన పిల్లలిద్దరి గురించి చెబుతూ కన్నీరు పెట్టుకుంది. పవన్‌తో విడాకుల అనంతరం ఆద్య, అకీరాలను తన వద్దే ఉంచుకొని వారి ఆలనాపాలనా చూసుకుంటూ వారి వారి భవిష్యత్ ప్రణాళికలో కీలక భూమిక పోషిస్తోంది రేణు దేశాయ్. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్‌తో స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసి ఆమె బర్త్ డే కానుకగా ప్రసారం చేసింది యాంకర్ సుమ.