ప్రేమ, పెళ్లి అంశాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయబద్దంగా ఉంటుందని చెప్పింది కియారా అద్వాణీ. కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోలేదని పేర్కొంది. 'డేటింగ్ యాప్స్ సంస్కృతిని నేను ఇష్టపడను. పాతకాలంలో మాదిరిగా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రేమపట్ల నాకు విశ్వాసం ఉంది.ప్రేమ విషయంలో నేను పాత ఆచారాల్ని నమ్ముతాను. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం అతనితో కలిసి ఉండాలనుకుంటా' అంటూ చెప్పింది కియారా అద్వానీ.