నందమూరి కుటుంబంలోనూ జనాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న జూనియర్ యన్టీఆర్ లాంటివాళ్ళు వస్తేనే తెలుగు దేశం పార్టీ ఇక్కడ బతికి బట్టకలుగుతుందని అభిమానుల భావన. ఎందుకంటే జూనియర్ యన్టీఆర్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనే. అదీగాక, అతనికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అతను ఒక్కసారి వచ్చి జనం ముందు నిలుచుంటే చాలు, కథ వేరుగా ఉంటుందనీ అంటున్నారు.  నందమూరి ఫ్యామిలీలో పార్టీని బతికించగల సత్తా ఒక్క జూనియర్ కే ఉందని అధిక సంఖ్యాకులు భావిస్తున్నారు.