ఈరోజు నిహారిక అలంకరణలో ప్రత్యేకత ఉంది. ఆమె తన తల్లి పద్మజ చీర కట్టుకుని ముస్తాబయ్యారు. ఈ చీర కూడా ఇప్పటిది కాదు.. 32 ఏళ్ల క్రితం నాటిది. పద్మజ నిశ్చితార్థం చీర. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. 32 ఏళ్ల క్రితం నిశ్చితార్థం రోజున తన తల్లి ఈ చీరలో ముస్తాబైన ఫొటోను, తన ప్రస్తుత ఫొటోను పక్కపక్కన పెట్టి షేర్ చేశారు.