సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి  ముఖ్య అతిథిగా రానున్నారంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబును కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.బిగ్బాస్ ముగింపు వేడుకు డిసెంబర్ 20వ తేదీన నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు సమాచారం.