ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కోసం అలియా భట్ రీసెంట్గా హైద్రాబాద్లో అడుగుపెట్టింది.ఈ సందర్భంగా మహేష్ గారాల పట్టి సితారని కలిసి ఆమెకి ప్రత్యేక బహుమతి ఇచ్చింది. తన సొంత బ్రాండ్ దుస్తులు సితారకి ఇవ్వగా వాటిని చూసి మురిసిపోయిన లిటిల్ ప్రిన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నా కెంతో ఇష్టమైన నటి అలియా భట్ ఈ డ్రెస్ తీసుకొచ్చింది, ఇది నాకెంతో నచ్చింది.  చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది సితార.