ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది తమన్నా. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ మిల్కీ బ్యూటీ. తాజాగా సత్యదేవ్ లాంటి యంగ్ హీరోతో గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తుంది. ఇమేజ్ లో తన కంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉన్న సత్యదేవ్ లాంటి అప్ కమింగ్ హీరోతో నటించడానికి ఎలాంటి ఈగోలు చూపించడం లేదు తమన్నా.