పవన్ రెండవ భార్య రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్, ఆద్య నిహారిక పెళ్ళికి హాజరు కాలేదు. పవన్ తో విడిపోయిననాటి నుండి రేణూ దేశాయ్ మెగా ఫ్యామిలీ గడప తొక్కలేదు. ఆ ఇంటిలో జరిగిన ఏ ఒక్క వేడుకకు ఆమె హాజరు కాలేదు. అయితే పిల్లలు ఆద్య, అకీరా చిరంజీవి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు.మరి అకీరా, ఆద్య చిరంజీవి, నాగబాబు కుటుంబాలతో ఇంత సాన్నిహిత్యం కలిగి ఉండగా, వారిని నిహారిక పెళ్ళికి ఎందుకు ఆహ్వానించలేదు అనేది ఆసక్తికర అంశం.