'రాధే శ్యామ్' సినిమా సంబంధించి భారీ యాక్షన్ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. సుమారు 30 రోజుల పాటు ప్రభాస్ తదితరులపై స్టయిలిష్ యాక్షన్ దృశ్యాలు తెరకెక్కించారట. అయితే, ఈ షెడ్యూల్ వెనుక చాలా కష్టం ఉందని దర్శకుడు రాధాకృష్ణకుమార్ చెప్పారు. ''నా రెండేళ్ల కల ఈ యాక్షన్ అడ్వెంచర్. దీనికి ఓ నెల సుదీర్ఘమైన షెడ్యూల్లో ప్రాణం పోయడానికి వంద రోజుల పాటు వెయ్యిమంది నాన్‌స్టా్‌పగా పని చేశారు. ఇంతకు ముందెన్నడూ తెరపై చూడని విధంగా దీనిని తీర్చిదిద్దిన యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్, అతని బృందానికి మా 'రాధే శ్యామ్' బృందం తరఫున నేను, యూవీ క్రియేషన్స్ సంస్థ, ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస, కళా దర్శకుడు రవీందర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం''