పోలవరంలో అనుష్క బోటు షికారు.. గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సన్నిహితులతో కలిసి పడవలో గోదావరి నది దాటిన ఆమె ముఖానికి మాస్కు ఉండటం వల్ల స్థానికులు వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఈ పర్యటనకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం తో అనుష్క పోలవరం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు..ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..