''సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. తనతో ఇరవై నాలుగు గంటలు ఆడుకోలేననే బాధ వెంటాడేది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది.. నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా నిహా తల్లి'' అంటూ నటుడు నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు.