ఇక సోషల్ సోషల్ మీడియా లో వివాదస్పదమైనా కామెంట్స్ తో రెచ్చిపోయింది. "ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి లాగ, మీ ఇంట్లో పెళ్లి లాగా మీరెందుకురా తెగ హడావిడి చేస్తూ పిసికేసుకుంటున్నారంటూ యూట్యూబర్లపై సెటైర్స్ వేసింది శ్రీ రెడ్డి. నాగబాబు కూతురు పెళ్లి అయితే అంత అవసరామా? మీకు. ''యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయనొచ్చాడు, ఈయనొచ్చాడు, ఆయన డాన్సులు చేశాడు.. ఏంట్రా? ఏదైనా ఉపయోగపడే పని చేయండిరా. ఆ రైతులు రోడ్లమీదకొచ్చి ఏడుస్తుంటే సపోర్ట్ చేయడం తెలియదు కానీ ఈ చెత్త మాత్రం షేర్స్ కొట్టుకుంటూ అబ్బా! అనడం.. ఛీ, చేంజ్ కండిరా'' అంటూ శ్రీ రెడ్డి ఫైర్ అయింది.ఇక మీడియా పై కూడా ఈ విధంగా మండి పడింది.మీడియా కూడా దీన్ని అంత హైలైట్ చేయాల్సిన పని లేదని, దేశంలో హైలైట్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. "పనికిరాని ఎదవల్లారా! నేనన్నది మీడియాను కాదు.. ఇలాంటి పెళ్లిళ్లన్నీ చూసేవాడిని అంటున్నా.. పోరా" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.