మెగాస్టార్ చిరంజీవి రేంజే వేరు. అభిమానులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారాయన. ఎవరైనా అభిమానులు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి ఆదుకుంటారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ పేద అభిమాని కుమార్తె పెళ్లి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు.