మహేష్ సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ జనవరి 25న ప్రారంభం కానుందని తెలిసింది. హైదరాబాద్లో మొదలయ్యే షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించి, ఫిబ్రవరిలో చిత్ర బృందం గోవా చేరుకోనుంది. అక్కడ షెడ్యూల్ పూర్తయ్యాక మూడో షెడ్యూల్ అమెరికాలో చేస్తారని సమాచారం. మార్చి, ఏప్రిల్ నెలలో 40 రోజులపాటు అమెరికాలో చిత్రీకరణ చేయనున్నట్లు తెలిసింది