కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంది హాట్ బ్యూటీ  హిమజ. అప్పట్లో ''మేకప్ వేసే ముఖం కాదు నీది.. ఎంత చెప్పినా నీలో నటన మెరుగపడదు'' అని ముఖం మీద అన్నవారే.. ఇప్పుడు ఏ క్యారక్టర్లో అయినా అతికినట్టు సరిపోతున్నావ్ అంటూ ప్రశంసిస్తున్నారని చెప్పింది. అలా చివాట్లు తిన్నచోటే ప్రశంసలు దక్కుతుండటం చాలా సంతోషంగా అనిపిస్తోందని పేర్కొంది. అంతేకాదు అసలు మజా అంటే నటనలోనే ఉంటుందంటూ వృత్రిపై ప్రేమను బయటపెట్టింది ఈ హాట్ బ్యూటీ..