F3 లో ఎఫ్ 2కి మించిన కామెడీనే కాదు.. గ్లామర్ కూడా ఉంటుందని టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. తమన్నా, మెహ్రీన్ తో పాటు మరో ముగ్గురు నాయికలు కూడా ఎఫ్ 3లో సందడి చేస్తారని తెలిసింది.అందులో ఒకరు ప్రత్యేక గీతంలో మెరిస్తే.. మరొకరు వెంకీకి ప్రియురాలిగా, ఇంకొకరు వరుణ్ కి లవర్ గా దర్శనమిస్తారట. మొత్తానికి.. ఐదుగురు హీరోయిన్స్ తో ఎఫ్ 3 మరింత కనువిందుగా ఉంటుందనీ సమాచారం.