మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 ముగియనుండడంతో రోజు రోజుకు ఈ షో పై ఆడియన్స్ లో మరింతగా ఆసక్తి పెరుగుతోంది అనే చెప్పాలి. మరోవైపు ఈ వారం ఆఖరి ఎలిమినేషన్ వారం కావడంతో మొత్తంగా ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు బయటకు వెళ్తారు, ఎవరెవరు హౌస్ లో ఉంటారు అనే దానిపై అందరిలోనూ ఒకటే ఉత్కంఠ.