ఖుషీ ఖుషీగా' షో ఫస్ట్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను నాగబాబు తాజాగా విడుదల చేశారు. అందులో ఓ లేడీ కంటెస్టెంట్ స్టాండప్ కామెడీ చేస్తూ.. 'నాగబాబు గారూ.. వరుణ్ బాబు నేను ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం ఆయనకు చెప్పగానే.. చూడు హసీనా.. జిందగీ మంచిది కాదు.. వట్టి గీతలే మన చేతులో ఉంటాయి' అని చెప్పింది.  దీంతో నాగబాబుతో సహా అక్కడున్న వారంతా బిగ్గరగా నవ్వేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.