కొంతమంది పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీసి, అలాగే గ్లామర్ ఎక్సపోజ్ చేసి యూత్ ని పాడు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతారు. అలాంటి వారు లైఫ్ లాంగ్ చరిత్రలో నిలిచిపోతారో ఏమో తెలీదు కాని.. మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోయే వారు చాలా మంది ఉంటారు. ఇక ఆ కోవలోకి రియల్ హీరో సోనూ సూద్ ఖచ్చితంగా చేరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సోనూ సూద్ ఈ లాక్ డౌన్ టైంలో అనేకమంది వలస కూలీలని, పేద ప్రజలని ఆదుకున్నాడు. వారికి అండగా నిలిచాడు. వారి అక్కర్లు, అవసరాలు తీర్చాడు. అందువల్ల రియల్ హీరో అయ్యాడు