మహేష్ బాబు 'ఛలో' సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.. ఇప్పటికే వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన ఛలో, భీష్మ చిత్రాలలో రష్మికనే హీరోయిన్ గా నటించింది. ఇంకా చెప్పాలంటే రష్మీకను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే.