టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పరుగు,యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'అదుర్స్' చిత్రాలలో నటించింన షీలా... ఆ తర్వాత సినిమా పరిశ్రమకు చెందిన "సంతోష్ రెడ్డి" అనే వ్యక్తిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది.పెళ్లయిన తర్వాత షీలా కౌర్ మళ్లీ సినిమాలలో నటించలేదు.చివరగా కన్నడలో 2018వ సంవత్సరంలో "హైపర్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం షీలా కౌర్ చేతిలో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు. ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపార రంగంలో రాణించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.