ఉత్తరాది పరిశ్రమ అయిన బాలీవుడ్ ఇండ్రస్టీ లో కూడా మన రజినీకాంత్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.  రజనీ సినిమా వస్తోంది అంటే.. షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్ .. అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు వేచి చూస్తారు.మళ్లీ సౌత్ నుంచి ఉత్తరాదిన ఆ స్థాయిని అందుకునే సత్తా ఎవరికి ఉంది? అంటే బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది.మార్కెట్ బాక్సాఫీస్ రికార్డుల పరంగా రజనీకాంత్ తర్వాత విస్త్రతమైన పరిధిని విస్తరించిన స్టార్ గా డార్లింగ్ ప్రభాస్ పేరు మార్మోగుతోంది.