దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా తన తరువాత సినిమాని రవితేజతో చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు గాని, బోయపాటి శ్రీను మాత్రం ఇప్పటికే రవితేజ కోసం ఓ స్క్రిప్టును సిద్ధం చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందట...