తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. ఆయన హీరోగా చేస్తూనే మరోవైపు విలక్షణ నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. టాలీవుడ్లో తిరుగులేని స్టార్‌గా ఎదుగుతున్నాడు హీరో రానా. బాహుబలి సినిమాతో విలక్షణ నటుడిగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు భళ్లాలదేవ. ఇక నేడు దగ్గుబాటి రానా పుట్టినరోజు.