హీరో అల్లు అర్జున్ తాజాగా పాలకొల్లుకు వెళ్లారు. విమానంలో రాజమండ్రి వెళ్లిన బన్నీ అక్కడి నుంచి బైరోడ్ లో పాలకొల్లుకు చేరుకున్నారు. అల్లు అర్జున్ కు సన్నిహితుడైన బన్నీ వాసు సోదరుడు ఇటీవల మరణించారు. కరోనా తగ్గాక ఊపిరితిత్తుల సమస్య రావడంతో ఆయన మరణించారు. దీంతో బన్నీ వాసును పరామర్శించడానికి స్వయంగా అల్లు అర్జున్  వెళ్లి పరామర్శించడం విశేషం.