2020లో అత్యధిక ట్వీట్లు ఏ దక్షిణాది హీరో గురించి, ఏ దక్షిణాది హీరోయిన్ గురించి చేశారు అనే విషయాలను ట్విట్టర్ ఇండియా సోమవారం ప్రకటించింది. అలాగే, ఏ దక్షిణాది సినిమా పేరుతో అత్యధిక ట్వీట్లు చేశారో కూడా సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఈ జాబితాలో తమిళ సినిమా ‘మాస్టర్’ మొదటి స్థానంలో ఉంది. #Master హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఏడాది ఒక సినిమా గురించి అత్యధిక ట్వీట్లు చేశారు.ఇక ఆ తరవాత స్థానంలో ‘వకీల్ సాబ్’ ఉంది. తెలుగు నుంచి అత్యధిక ట్వీట్లు చేసిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ రకంగా ‘వకీల్ సాబ్’ ట్విట్టర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.