మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ‘షూటౌట్ ఎట్ ఆలేరు’తో ఓటీటీలో నిర్మాతగా అడుగుపెట్టింది. ఇప్పుడు సినిమా నిర్మాతగా మారబోతోందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ‘24 కిస్సెస్’, ‘పీఎస్వీ గరుడవేగ’, ‘ఎల్ 7’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న అదిత్ అరుణ్ హీరోగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా నిర్మించబోతున్నారట. దీనికి సుస్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ‘షిట్ హ్యాపెన్స్’ అనే అడల్ట్ కామెడీ సిరీస్‌తో ఆకట్టుకున్న ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడట.