గత 100 రోజులుగా తెలుగు ఆడియన్స్ ను బిగ్ బాస్ 4 చాలా అలరించింది. ఇప్పుడు మరో మూడు రోజుల్లో ఈ షో ముగిసిపోనుంది. ఈ క్రమంలోనే ఫినాలేను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే ఫినాలే వీక్ మొదలైన తర్వాత ఇంట్లో ఏడుపులు లేవు.. కేవలం నవ్వులు మాత్రమే ఉన్నాయి.