1979 లో వచ్చిన ముద్దుల కొడుకు సినిమాలో అక్కినేని నాగేశ్వరావు గారు, శ్రీదేవి గారి కొడుకుగా నటించారు హరీష్.  హరీష్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాళం సినిమాల్లో నటించారు.తెలుగులో చివరిగా 2007 లో వచ్చిన పెళ్లయింది కానీ సినిమాలో, హిందీలో 2018 లో వచ్చిన ఆ గయా హీరో సినిమాలో కనిపించారు. 1995 లో హరీష్ కి, సంగీతతో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కొడుకులు.ప్రస్తుతం హరీష్, తన భార్య పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నారు.