F2చిత్ర ప్రారంభోత్సవంలో వెంకటేష్ పాల్గొనలేదు. ప్రస్తుతం ఆయన ‘నారప్ప’ షూటింగ్లో బిజీగా ఉండటంతో కుదరలేదు. అలాగే, మెహ్రీన్ కూడా హాజరవ్వలేదు. వరుణ్ తేజ్, తమన్నాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, ఫైనాన్సియర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు.