దిల్ రాజు  పుట్టినరోజు పార్టీకి నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలెవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది.  దీనిపై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తుండడంతో ఈ ఇష్యూ ట్రెండింగ్ అవుతోంది.ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోన్న అంశం ప్రకారం.. దిల్ రాజు తన పుట్టినరోజు వేడుకకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించలేదట. ఈ కారణంగానే తమను పిలిచినా కూడా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా దీనికి హాజరు కాలేదని అంటున్నారు.