పుట్టిన రోజును పురస్కరించుకొని ముందు రోజు రాత్రి టాలీవుడ్ ప్రముఖులకు దిల్‌రాజు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. అందులో కన్నడ సూపర్ స్టార్ యశ్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు దిల్ రాజు పార్టీకి వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలాఉంటే దిల్‌రాజుతో మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య, రామ్, విజయదేవరకొండ కలిసి ఫోటో దిగారు.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ర హీరోలందరిని ఒకే ఫ్రేమ్‌లో అభిమానులు ఫిదా అవుతున్నారు.అలాగే రామ్ చరణ్, ప్రభాస్ కూడా ఫోటోలకు పోజులిచ్చారు..