ఎన్టీఆర్ తో కాకుండా ప్రభాస్ తో మూవీ ప్రకటించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ . సలార్ పేరుతో భారీ పాన్ ఇండియా మూవీని ఆయన ప్రకటిచడం జరిగింది. దీనితో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందా లేదా అనే సందేహం ఎన్టీఆర్ అభిమానుల్లో మొదలైంది. దీనిపై తమకు స్పష్టత ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనను కోరుతున్నారు. ప్రశాంత్ నీల్ మాత్రం సదరు సందేశాలకు స్పందించడం లేదు.