బాబీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. తన జీవితపు మూల స్తంభంగా బాబీని పేర్కొన్నాడు. రాబోయే ఏడాది ప్రయాణంలో మరపురాని సంవత్సరంగా మిగలాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. తన జీవితపు ప్రతీ సందర్భంలో అదేవిధంగా ప్రతీ మూవీకి మూల స్తంభంగా ఉంటూ వస్తున్నావని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.