సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఈ బ్యానర్లో సాయి తేజ్ కొత్త సినిమాను ప్రారంభించారు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీతో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.