కోతలరాయుడు మూవీలో చిరుతో పనిచేసిన హీరోయిన్ మంజు భార్గవి, ఆయనను శంకరాభరణం మూవీ ప్రీమియర్ షోకి ఆహ్వానించారట. అప్పటికి చిరంజీవికి పెళ్లి కాలేదట. ఆ ప్రీమియర్ షోకి అల్లు రామలింగం కుటుంబం కూడా హాజరయ్యారట.శంకరాభరణం మూవీ క్లైమాక్స్ చూసిన చిరు భావోద్వేగానికి గురయ్యారట.  ఆయనకు కన్నీళ్లు వచ్చేయడంతో ఎవరైనా చూస్తే..నవ్వుతారని కర్చీఫ్ కోసం వెతుకుతున్నాడట. పక్క సీటులో ఉన్న మంజు భార్గవి కళ్ళు తుడుచుకోమని ఆమె చీర కొంగును చిరుకు ఇచ్చారట. ఆమె చీర కొంగుతో చిరంజీవి కళ్ళు తుడుచుకుంటూ ఉండగా... సడన్ గా లైట్స్ వెలిగాయట. మంజు భార్గవి చీర కొంగు తన చేతిలో ఉండడం చూసిన వారందరు తప్పుగా అనుకున్నారేమో అని చిరంజీవి బాధపడ్డారట.